మార్పు గాలులు – ఒక జీవన గీతం
కవిత: ఎం. ఆర్. కె. మూర్తి నాయుడు
ఆధారంఈ కవితకు ప్రేరణ ఒక చైనీస్ సుభాషితం నుంచి వచ్చింది. ఆ సూక్తి ఇలా చెబుతుంది
"When the winds of change blow, some build walls, others build windmills."
"మార్పు గాలులు వీచినప్పుడు, కొందరు గోడలు కడతారు – మరికొందరు గాలిమిల్లులు నిర్మిస్తారు."
ఈ సూక్తి జీవితంలో ఎదురయ్యే మార్పుల పట్ల మన మనోభావాలను ప్రతిబింబిస్తుంది. కొంతమంది ఆ మార్పును భయంతో నిరాకరిస్తారు; మరికొందరు దానినే అవకాశంగా మలచుకుంటారు. ఈ భావాన్ని కవిత రూపంలో మనసుకు హత్తుకునేలా తీర్చిదిద్దాను.
కవిత
మార్పు గాలులు వీచిన వేళ,
కొంతమంది గోడలు కట్టి దాగుతారు,
జీవిత మార్గాన్ని తామే మూసేస్తారు,
తమ భయాలకే తాళాలు వేస్తారు.
కానీ మరికొందరు, నిశ్శబ్దంగా,
ఆ గాలినే శక్తిగా మలచుకుంటారు;
గాలిమిల్లుల్ని నిర్మించి, ఆశతో,
అభివృద్ధి సాగరంలో నావికులవుతారు.
ఒకరికి అది గాలిచీకటి, శాపమే,
ఇంకొకరికి అది వెలుగు, వరమే!
భయపడే మనసు గోడలలో నలుగుతుంది,
ధైర్యవంతుల హృదయం గాల్లో విహరిస్తుంది.
మార్పు — అది శత్రువా? లేక శ్రేయస్సా?
నీ దృష్టిలో అది నిర్ధారితమవుతుంది.
గాలులు మారినా, దిక్కులు తిరిగినా,
ఆదిగాలి నీవే అనుకుంటే… విజయం నీదే!
If you like leave your comment below

No comments:
Post a Comment